Header Banner

ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడ్డ జైలర్! చార్జ్‌షీట్‌కు సిద్దమైన పోలీసులు!

  Fri Apr 11, 2025 17:43        Others

అనంతపురం జైలర్‌ వేధిస్తున్నాడంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం ఏపీలో సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని.. పెద్దాపురం సబ్‌జైల్లో డిప్యూటీ జైలర్‌గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి వేధింపులకి గురి చేశాడని వివాహిత ఆరోపించింది.దీంతో జైలర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు ఇస్తానని.. తాను చెప్పినట్టు చెయ్యండి అంటూ వేధించాడని, కొన్ని వీడియోలు కూడా తనకు పంపినట్లు యువతి పేర్కొంది.. ఈ మేరకు బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్‌ సుబ్బారెడ్డిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దాపురం సబ్ జైల్ నుంచి ఇటీవల అనంతపురం సబ్ జైలుకు బదిలీ అయ్యారు సుబ్బారెడ్డి. యువతి ఆరోపణలతో విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించారు.. దీంతో సుబ్బారెడ్డి ఇంటినుంచి పరారయ్యాడని సమాచారం.. దీంతో జైలర్‌ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ జైళ్లశాఖ డీజీకి లేఖ రాశారు విశాఖ సీపీ బాగ్చి.. జైలర్‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌ ఫైల్ చేస్తామని.. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పంపించామని సీపీ బాగ్చి తెలిపారు. బాధితురాలికి న్యూడ్ వీడియోలు ఫోటోలు పంపినట్టు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #SubbaReddyCase #AnantapurJailorControversy #JailorHarassment #CyberCrimeComplaint #JusticeForVictim